దూరమే అనిపించదే ..నా తీరమై నువ్వు ఉండగా

 సొగసరి మనసే కోరెను నిన్నే... చెలియా ........
నీ కోసం వస్తున్నా ...
చిరు గాలై వస్తున్నా  ...


నా పయనమే నీ వైపుగా ..సాగేనులే నేడు ప్రేమగా 
దూరమే అనిపించదే ..నా తీరమై నువ్వు ఉండగా 
నీ రూపమే కనిపించగా ...నా  కనులకే ఒక పండుగ   
నీ చూపులే నను చేరగా ... పులకించి పోతాను ప్రియుడిగా 



సొగసరి మనసే కోరెను నిన్నే... చెలియా ........
నీ కోసం వస్తున్నా ...
చిరు గాలై వస్తున్నా  ..

చిన్నారి లా నువు నడవగా   ... నీ వెంట వుంటాను నీడగా 
చిరు నవ్వుతో నిను చూడగా ...  నీ సొంతమవుతాను పాటగా 
 నా దేవతై  తోడుండగా ..ప్రతి క్షణము తలిచేది నిన్నెగా ...  
ప్రాణమే పోయేనుగా ..  నీ కంట కన్నీరు చూడగ ....

సొగసరి మనసే కోరెను నిన్నే... చెలియా ........
నీ కోసం వస్తున్నా ...
చిరు గాలై వస్తున్నా  ..

This entry was posted in

Leave a Reply