మాతృ ప్రేమకు మురిసిన ఓ పసి తనం పలికే తొలి తెలుగు పదం "అమ్మ"


అమ్మ ..అమ్మ ..అమ్మ...

మాతృ బాష గా "తెలుగు" నేర్పే తొలి అక్షరం "అ " అయితే ..
మాతృ ప్రేమకు మురిసిన ఓ పసి తనం పలికే తొలి తెలుగు పదం "అమ్మ".....

ఒక పసి హృదయాన్ని అలరించే భావం "ప్రేమ " అయితే 
ఆ ప్రేమను తొలిసారిగా పరిచయం చేసే ఒక  దేవత  "అమ్మ"

తొలిసారి పసి  కనులు కోరే ఆకారం "అమ్మ "
ప్రతి క్షణం పసి మనసు కోరే మమకారం "అమ్మ "




బుడి బుడి నడకల వయసులో పసిపాప కోరే తోడు "అమ్మ"
తీరం లేని నడకకి నీడై వచ్చే రూపం "అమ్మ"
నిదురని కోరే పసి వయసుకి సరసన చేరే మనిషే "అమ్మ"
ఆకలితో పసి పాప  చేసే శబ్దానికి చెలించి ఆకలిని తీర్చే ఆహారం "అమ్మ"

పసి పెదవుల నడుమన  నవ్వు ని పండించే కవ్వింత "అమ్మ"
పసి నవ్వుకి పులకించిన ఆనంద భాష్పం "అమ్మ "
పెరిగే వయసులో బాధల్ని పంచుకునే తత్వం "అమ్మ"
అలసిన మనసుని  తన ఒడిన చేర్చుకొనే విశ్రాంతి "అమ్మ"....

పెళ్లి వయసు వచ్చిన బిడ్డలకి అవసరమైన  తోడుని చేర్చే  పెద్దతనం "అమ్మ"
కాపురానికి  కి ప్రతిఫలం గా  లభించిన పసిజన్మలని ఆడించే అమ్మమ్మ ,నానమ్మ  "అమ్మ"

 కన్నబిడ్డలకి  తన జీవితాంతం  ప్రేమను పంచే  దేవతే అమ్మ .....................................

This entry was posted in

Leave a Reply