ఒక్కడిగా ఎక్కడికో సాగిపోవాలనిపిస్తుంది

               ఎదో జరుగుతోంది ఏదేదో జరుగుతోంది 
                  నువ్వు లేని చోట నరకం లా ఉంది 
            నిను మరువలేక జీవితం భారంగా మారింది 

ఆశ చావదు ..నిరాశ నను వదలదు ..
ఒంటరిగా ఉండాలనిపిస్తుంది 
ఒక్కడిగా ఎక్కడికో సాగిపోవాలనిపిస్తుంది 
గమ్యం తెలియక అక్కడే ఆగిపోవలనిపిస్తుంది 

                       చీకటి ఇష్టంగా మారింది 
                        వెలుగును చూడలేకుంది 
                     కనులు మూస్తే నిదుర రాదు 
                      కనురెప్పలు తెరవాలని లేదు

నీ ప్రమకై నా  జీవితం ఉంది 
నీ ప్రేమ లో  తడవాలని ఉంది 
నా ప్రేమ ని అర్థం చేసుకొని నాతో వస్తే 
నిను జీవితాంతం  దేవతలా చూసుకోవాలని ఉంది .........

This entry was posted in

Leave a Reply